MLA Vegulla : సుపరిపాలన దిశగా అడుగులు

TRINETHRAM NEWS

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం…

వెదురుపాకలో సి.సి రోడ్లు, డ్రైన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని రాష్ర్ అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, స్పష్టం చేశారు. మంగళవారం రాయవరం మండలం, వెదురుపాక, లొల్ల, మండపేట పట్టణం 11వ వార్డు, 29వ వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా కూటమి నాయకులు ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రతీ ఇంటి వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొనుటకు వీలుగా తొలి అడుగు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీకారం చుట్టారని అన్నారు. ఏ సమస్య ఉన్న పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రతీ గ్రామాన్ని, వార్డు ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, రోడ్లు, కరెంటు వాటిపై సత్వర చర్యలు చేపడతామన్నారు. వెదురుపాక గ్రామంలో రూ.29 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లు, డ్రైన్లు ను ఈ సంధర్బంగా ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Steps towards good governance

You cannot copy content of this page

Scroll to Top