TELANGANA

NHM : ఎన్ హెచ్ ఎం నాల్గవ తరగతి ఉద్యోగులకు 15600 రూపాయలు వేతనాలు ప్రభుత్వం పెంచి ఇవ్వాలి

TRINETHRAM NEWS

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్హెచ్ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ డిమాండ్

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్

త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ జిల్లా ప్రతినిధి.. కమీషనర్, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మరియు మిషన్ డైరెక్టర్ ఎన్.హెచ్.యం. కార్యాలయం ముందు ధర్నా చేసి నేషనల్ హెల్త్ మిషన్ పనిచేయుచున్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులకు జీవో నెంబర్ 60 ప్రకారం రూపాయలు 15,600 రావాల్సి ఉన్నప్పటికీ కేవలం 10,000 మాత్రమే ఇస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ విమర్శించారు.

నేడు ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటీలోని ఎన్ హెచ్ ఎం డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో దాదాపు 800 మంది నాలుగో తరగతి సిబ్బంది ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కింద పనిచేయుచున్నారని వీరికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు అమలు చేయాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న నవంబర్, డిసెంబర్ మరియు జనవరి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎన్ హెచ్ ఎం లో అధికారులు ఈ సంస్థలో పనిచేయుచున్నటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఇందులో కొంత మందికి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జీతాలు చెల్లిస్తూ కింది స్థాయికి ఉద్యోగుల మాత్రం వారి పొట్ట కొడుతూ శ్రమదోపిడికి గురిచేయుచున్నారని వారు విమర్శించారు. అనంతరం వినతి పత్రాన్ని కమిషనర్ సర్వే సంగీత సత్యనారాయణ మేడం కు సమస్యలతో కూడిన వినతి అందజేయడం జరిగింది. కమిషనర్ చెప్పిన విధంగా 15 రోజుల్లోపు వేతనాలు వస్తాయని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా, జనగాం జిల్లా అధ్యక్షురాలు గంగరబోయిన జ్యోతి, దాడి మాధవరావు, జ్యోతి, లక్ష్మి దేవమ్మ, నాగమణి, మంగమ్మ, శైలజ, షాముల్, శ్రీనివాస్, కృష్ణ, వెంకటయ్య, పరశురాం, సాయిబాబా, రమేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Government should increase the salaries of NHM class IV

You cannot copy content of this page