ANDHRAPRADESH

MLA Kakarla : కమ్మ పాలెం రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 9: నెల్లూరు జిల్లా :జలదంకి… జలదంకి మండలం: జలదంకి పంచాయతీ పరిధిలోని కమ్మపాలెం గ్రామానికి 68.5 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయడం గ్రామాభివృద్ధిలో ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలిచింది. ఈ నేపథ్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , కమ్మపాలెం గ్రామానికి విచ్చేయగా గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఆదరాభిమానాలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో, నినాదాలతో ఎమ్మెల్యే హృదయపూర్వక స్వాగతం తెలిపి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని , ఎమ్మెల్యే , కాకర్ల సురేష్ , అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఈ అభివృద్ధి కార్యక్రమానికి తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి,కొణిదల పవన్ కళ్యాణ్ సహకారంతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న గ్రామీణ రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, రోడ్డు సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని చెప్పారు. గ్రామస్తుల ముఖాల్లో కనిపిస్తున్న ఆనందం, సంతృప్తే తమకు లభించిన అసలైన ప్రతిఫలమని ఆయన అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా సంక్షేమం మరియు అభివృద్ధిని సమపాళ్లలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నదని ఎమ్మెల్యే , కావ్య కృష్ణారెడ్డి ,స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సమాన న్యాయం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Kakarla participated in the inauguration ceremony

You cannot copy content of this page