44 కార్మిక చట్టాలు అమలు చేయాలి 4 లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి.
త్రినేత్రం న్యూస్, కాకినాడ,అక్టోబర్,31: ఏఐ టీయూసీ,ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 106 వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాకినాడలో స్థానిక వీర కమల్ థియేటర్ వద్ద మున్సిపల్ వర్కర్స్, భవన నిర్మాణ కార్మికులతో నగర కార్యదర్శి టి.అన్నవరం అధ్యక్షతన జెండా ఆవిష్కరణలు ఘనంగా జరిగాయి. ఈ జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఏఐటియుసి జెండాను తోకల ప్రసాద్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐటియుసి 106వ. వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించామని, ఈ వేడుకలు దేశవ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయని, కాకినాడలో ఏఐటీయూసీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ, జిజిహెచ్,లో మెడికల్, మున్సిపాలిటీ, భవన నిర్మాణ, ఆర్టీసీ, ఏపీ ఎలక్ట్రిసిటీ, సివిల్ సప్లై, తదితర రంగాల్లో జండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించామని ఆయన అన్నారు.
కార్మికులు, ఉద్యోగుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఏఐటీయూసీ అని, 1920 అక్టోబర్ 31న బొంబాయిలో లాలా లజపతిరాయ్ ఎఐటీయూసి, వ్యవస్థాపించారని, 105 సంవత్సరాలు పాటు ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసి 106 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నావని ఆయన అన్నారు. 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, పని దినాలు పెంచే ఆలోచన విరమించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయుట మానుకోవాలని, ప్రభుత్వ రంగంలోనే, కొనసాగించాలని, ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులు అన్ని భర్తీ చేయాలని, కార్మికులు, ఉద్యోగులు సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఏఐటియుసి అని ఆయన అన్నారు. ఎస్. అచ్చుతాపురం రావిచెట్టు వద్ద భవన నిర్మాణ కార్మికులు అడ్డా వద్ద 8 ఏఐటీయూసీ జెండాను నగర కార్యదర్శి అన్నవరం ఆవిష్కరణ చేశారు.106వ కేకును కార్మికుల ఆధ్వర్యంలో కటింగ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ, జానిపల్లి అప్పన్న, నక్క లక్ష్మణ్, త్రిమూర్తులు, రమణ, దుర్గా,శ్రీను, రాచపల్లి ప్రసాద్, బచ్చల శ్రీను, చంటి, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


