MLA Vegulla : సాంకేతిక పరిజ్ఞానంతో మరింత విద్యాభివృద్ధి

TRINETHRAM NEWS

గౌతమి స్కూల్ లో పాల్‌ ల్యాబ్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 4, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మరింత అభివృద్ధిని సాధించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. మండపేట పట్టణంలోని గౌతమి మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన పర్సనలైజ్డ్‌ అడాప్టివ్‌ లెర్నింగ్‌ (పాల్‌ ల్యాబ్‌) ను ఎమ్మెల్యే వేగుళ్ళ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత నిస్తుందని తెలిపారు. విద్యార్థి సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. విద్యతో మాత్రమే దేశ భవిష్యత్‌ మారుతుందన్నారు. పాల్‌ ల్యాబ్‌ ద్వారా విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని ఎమ్మెల్యే జోగేశ్వరరావు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు, ఎంఈవోలు ఎన్‌.రామచంద్రరావు, సీహెచ్‌వీ సోమిరెడ్డి, హెచ్‌ఎం డి.శ్రీనివాస్‌, పాల్‌ ల్యాబ్‌ ఎఫ్‌ఎంఎస్‌ ఎ.సురేష్‌కుమార్, ఇన్‌చార్జ్‌ జె.రజని, నోడల్‌ టీచర్స్‌ కె.సత్యవాణి, ఎన్‌ఎస్‌ఎన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Further development of education with technology

You cannot copy content of this page

Scroll to Top