ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 03 : మండపేట.. సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం అని, వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు పేర్కొన్నారు. ఇటీవలె హాస్పటల్స్ నందు వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న 42 మందికి రూ.29,93,957/-లు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరు కాగా సదరు చెక్కులను మంగళవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు, చేతులమీదిగా బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సంధర్బంగా వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


