MLA Gorantla : ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తుంది కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

16వ వార్డు యు.పి.హెచ్.సికి వాటర్ ఫిల్టర్ మరియు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే గోరంట్ల

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 4 : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు స్థానిక 16వ వార్డు నందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు హాస్పిటల్ సిబ్బంది సూచన మేరకు తన స్వీయ నిధులతో వాటర్ ఫిల్టర్ బహుకరించి అలాగే నిక్షయ మిత్ర కార్యక్రమంలో భాగంగా టీబీ పేషెంట్లకు పౌష్టిక ఆహారం అందించేందుకు 30 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక సదుపాయాలు కల్పించడం జరిగిందని, డాక్టర్లు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. గతంలో కంటే కూడా ఓపి బాగా పెరిగిందని మంచి వాతావరణంలో హాస్పిటల్ నడుపుతున్నారని, త్వరలో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరుస్తామని అన్నారు. మెడిసిన్స్ స్టోర్ చేసేందుకు నూతన స్టోర్ రూమ్ నిర్మించేందుకు తక్షణమే అంచనాలు సిద్ధం చేసి నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ దాలిపర్తి వేమన, జిల్లా వైద్యాధికారి వసుంధర, డాక్టర్ కె.వినీత, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, చలమూరి సత్యనారాయణ, శీలం గోవిందు, పల్లి సాయి, సింగవరపు సత్యనారాయణ, అడపా వరప్రసాద్, కొమ్మన శ్రీనివాస్, సుబ్బాయమ్మ, వాసుపల్లి అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The coalition government will provide better services

You cannot copy content of this page

Scroll to Top