Trinethram News : రేపు (25-12-2025) క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి , క్రైస్తవ సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యం నిలవాలని ఆకాంక్షించారు.
అలాగే ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, నూతన ఉత్తేజం, విజయాలను తీసుకురావాలని ఆయన తన క్రిస్మస్ సందేశంలో పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


