“వెన్నుపోటు దినం”నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
పార్టీ ముఖ్య నేతల సమావేశంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలకుల కళ్ళు తెరిపించడానికి జూన్ 4వ తేదీన తలపెట్టిన “వెన్నుపోటు దినం”నిరసనకార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్సార్సీపి పార్టీ శ్రేణులకు సూచించారు శుక్రవారం అనపర్తి పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్సార్సీపి ముఖ్య నాయకుల సమావేశంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టారని మన అనపర్తి నియోజకవర్గం లో జూన్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం దగ్గర నుండి ర్యాలీ ప్రారంభమై స్థానిక తహసీల్దార్ కార్యాలయం దగ్గర వినతి పత్రం సమర్పించడంతో ముగుస్తుందని ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని గత ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని,సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలను ఎన్డీఏ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నిరసన కార్యక్రమా న్ని చేపట్టడం జరిగిందని ఈ నిరసన కార్యక్రమం ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లాటిఇజ్రాయిల్ ,రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి మండరాజా రెడ్డి,మాజీ సంపర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అద్దంకి ముక్తేశ్వరరావు, అనపర్తి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, బిక్కవోలు మండల పార్టీ అధ్యక్షుడు పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), రంగంపేటజడ్పీటీసీ పేపకాయలరాంబాబు ,ఎంపీటీసీ మత్సా వీరభద్రరావు,పెదపూడి జడ్పిటిసి వేపకాయలవెంకటలక్ష్మిరమణ ,అనపర్తి పట్టణ వైఎస్ఆర్సిపి కన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి,
నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాంబత్తుల చంటి, మాజీ శాఫ్ డైరెక్టర్ గుబ్బల అలేఖ్య లాజర్ బాబు, నియోజకవర్గ జేసిఎస్ కన్వీనర్ వెంకట రెడ్డి,పెదపూడి మండల అధ్యక్షులు గుత్తుల రమణ, మట్ట శ్రీను ఎంపీటీసీ, ఎంపీటీసీ సబ్బెళ్ల వీర్రాఘవ రెడ్డి,జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఉపాధ్యక్షుడు వేము చిరంజీవి, జిల్లా బీసీ సెల్ విభాగం సంయుక్త కార్యదర్శి కొమ్మనపల్లి శ్రీను,ఎంపీటీసీ సుధాకర్ , నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు కొండేటి భీమేశ్వర స్వామి,పుట్టకొండ మణికంఠ ,సర్పంచ్ కాపవరం రమణ,జిల్లా వివర్స్ విభాగం అధ్యక్షుడుపెనుగొండ శ్రీనివాస్ రావు ,నియోజకవర్గ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మండ వెంకటరెడ్డి , రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెక్రటరీ మొర్త శ్రవణ్ కుమార్, వెండ్ర సర్పంచ్ వాసు మేడపాటిఆనంద్ రెడ్డి తదితరులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


