MP Purandeswari : పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

TRINETHRAM NEWS

రూరల్ మండల బిజెపి కార్యకర్తల సమావేశంలో ఎంపీ పురందేశ్వరి

రాజమహేంద్రవరం, డిసెంబరు 24: ప్రజాసమస్యలు పరిష్కరించడం ద్వారా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర పూర్వ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపు నిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ 3వ మండల నాయకులు, కార్యకర్తలు బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలతో ధవళేశ్వరం కాటన్ మ్యూజియంలో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన ముఖాముఖి సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ముందుగా డెల్టా రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహానికి ఎంపీ పురందేశ్వరి పూలమాలవేసి భక్త్యంజలి ఘటించారు. నాయకులు, కార్యకర్తలతో కల్సి అల్పాహారం స్వీకరించారు. అందరితో కల్సి నేలపైనే కూర్చుని, పేరుపేరునా అందరి వివరాలు, సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. పలు విషయాలు చర్చించారు.
పంచాయితీ స్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ పురందేశ్వరి సూచించారు. ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర, మండల అధ్యక్షుడు షేక్ సాజిద్, మండల ప్రధాన కార్యదర్శి కుబేర రావు, అసెంబ్లీ నాయకులు యానాపు ఏసు, ఆకుల శ్రీధర్, సీనియర్ నాయకులు ఒంటెద్దు స్వామి, పన్నాల వెంకట సంతోషి, తనుబుద్ధి సూర్యభాస్కర్, గుర్రాల వెంకట్రావు, కొండలరావు, యువమోర్చ నాయకుడు ధనుంజయ్, ఓబిసి నాయకులు జి. సూరిబాబు, నాగేశ్వరరావు, రామలక్ష్మి, జగన్నాథం, జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు తగరం సురేష్, రాజు, పౌరోజు ఏసు, షేక్ సత్తార్, ఆనంద సాగర్, శ్రీనివాసు, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Efforts should be made to strengthen the party

You cannot copy content of this page

Scroll to Top