Special Puja : శ్రీ శ్రీ శ్రీ జట్లమ్మ అమ్మవారికి, శ్రావణమాసం మొదటి శనివారం, ప్రత్యేక పూజ కార్యక్రమం

TRINETHRAM NEWS

ప్రత్యేక పూజ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, కార్యనిర్వహక్కులు, వెంకటగిరి టౌన్ వాస్తవ్యులు, శ్రీ రాలి కరుణాకర్ రావు కుటుంబ సభ్యులు.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం, మురమండ గ్రామంలోనీ గ్రామదేవత శ్రీ శ్రీ శ్రీ జట్లమ్మ అమ్మ వారి దేవస్థానం నందు శ్రావణమాసంలో మొదటి శనివారం సందర్భంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరిటౌన్ వాస్తవులు శ్రీ ర్యాలీ కరుణాకర్ రావు వారి ధర్మపత్ని లక్ష్మీ వారి కుటుంబ సభ్యులు వారి మనవడుకిపుట్టు వెంట్రుకలు (తలనీలాలు) అమ్మవారికి సమర్పించి , ప్రత్యేక పూజలు జరిపినారు, తదుపరి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినారు, ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారినీ దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి, అన్న సంతర్పణ లో పాల్గొని అమ్మవారి ప్రసాదం తీసుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

For Sri Sri Sri Jatlamma Ammavaru,

You cannot copy content of this page

Scroll to Top