శాసన సభ్యులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 26/07/2025. నెల్లూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలం, పట్టణం యాదవ్ వీధిలో నిర్వహించినటువంటి సుపరి పాలన లో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కాకర్ల. సురేష్ తో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార , పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల మౌలిక అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలపై ప్రజల అభిప్రాయాలను ఇంటింటికి వెళ్లి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రజల విశ్వాసం నింపాయి. పథకాలు అమలు లబ్ధిదారులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ్యులు మరియు మంత్రికి అభినందనలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

State Minister participated along

You cannot copy content of this page

Scroll to Top