కర్నూలు జిల్లా : మార్చి : 3: (త్రినేత్రం న్యూస్); కర్నూలు పట్టణం బాలాజీ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో కూలర్ల గోదాంలో ప్లాస్టిక్ సామాగ్రి ఉండడంవల్ల మంటలు సెలరేగి భారీగా పొగలు అలుముకున్నాయి.
ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. పనిచేసే సిబ్బంది వంట కోసం తెచ్చిన రెండు గ్యాస్ సిలిండర్లు పేలడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

