గుంటూరు జిల్లా : అమరావతి: ఫిబ్రవరి : మూడు; (త్రినేత్రం న్యూస్); తిరుమల లడ్డు నెయ్యి కల్తీ అంశంపై సీట్ సమర్పించిన నివేదికపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. ఆ నివేదికలో కల్తీకు సంబంధించిన పాత్రధారులపైనే సిఫార్సులు చేసినట్లు మంత్రివర్గం అభిప్రాయ పడింది.
అయితే అసలు వాళ్లు ఎవరు అనేది తేల్చాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన తదుపరి చర్యలపై సమగ్రంగా ముందుకు వెళ్లాలని కేబినెట్ స్పష్టం చేసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

