తేదీ : 28/04/2025. గుంటూరు , విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు, విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి గెలిచింది. విశాఖ మేయర్ గా పీలా. శ్రీనివాసరావు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్ గా కోవెలమూడి. రవీంద్ర ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వ రాజ్ గెలుపొందారు.
అదేవిధంగా పాలకొండ నగర పంచాయతీ చైర్ పర్సన్ గా ఆకుల. మల్లేశ్వరి ఎన్నికవ్వడం జరిగింది. మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ గా మదర్ సాహెబ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుని పూరపాలక చైర్ పర్సన్ గా నార్ల. భువన సుందరి, వైస్ చైర్ పర్సన్ గా ఆచంట. సురేష్. ఎన్నికవ్వడం ప్రజలు సంతోషిస్తున్నారు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


