MLA Bandaru Satyananda Rao : రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం

TRINETHRAM NEWS

డిమాండ్ ఆధారిత పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలి…

రావులపాలెం మార్కెట్ యార్డులో ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు….

Trinethram News : రైతు నిలదొక్కుకోవాలి, రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం మార్కెట్ యార్డులో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షులు కె.వి.సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయంలో నానాటికీ పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకోసమే ప్రభుత్వం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. తక్కువ ఖర్చుతో పంటలను పండించడం, దిగుబడులు ఎలా పెంచాలి, విత్తనశుద్ధి, రుణ సౌకర్యం, మార్కెటింగ్ మొదలైన అంశాల్లో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ అధికారులు వ్యవసాయం గురించి మనకి చెప్పాలా?

మనకి తెలియని వ్యవసాయమా? అని కొందరు రైతులు అనుకోవచ్చన్నారు. ప్రభుత్వం చెబుతున్న పంచ సూత్రాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మారిన కాలం బట్టి ముందస్తు అంచనాలతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిమాండ్ ఆధారిత పంటలు పండించడం ఎలా? ఏ పంటకు రేటు వస్తుంది అనేది తెలుసుకుని పండించడం, పంట మార్పిడి మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. పంటలకు విలువ పెంచేందుకు పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుంటే సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. పసుపు పండించడమే కాకుండా, గ్రైండ్ చేసి విక్రయించడం చేయవచ్చన్నారు. అరటి నుంచి 20 వరకూ ఉప ఉత్పత్తులను తయారుచేయచ్చన్నారు. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు స్థాపించవచ్చన్నారు. నానో యూరియా వాడటం ద్వారా, డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లడం ద్వారా శ్రమ, ఖర్చు తగ్గుతాయని అన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు,చిలువూరి సతీష్ రాజు, కేతా శ్రీను,జక్కంపూడి బాలాజీ, కొప్పిశెట్టి ప్రసాద్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The government's intention is to generate income for farmers

You cannot copy content of this page

Scroll to Top