DSP lights up Christmas : క్రిస్మస్ వెలుగులు నింపిన డి.ఎస్.పి,బోగిరి మోజస్ పాల్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 24 :నెల్లూరు జిల్లా :కావలి.. గిరిజనులకు క్రిస్టమస్ కానుక ఇచ్చిన డి.ఎస్.పి బోగిరి మోజస్ పాల్.. ఈ రోజు కావలి పెంకులు ఫ్యాక్టరీ గిరిజన సంఘంలో ఉన్న చర్చికి గత కొంత కాలంగా కరెంట్ లేక చీకట్లో ఉంటున్నాము ఆ చర్చి కి కరెంట్ మీటర్ పెట్టించండి అని ఆ గిరిజన వృద్ధ మహిళల కోరిక మేరకు కరెంట్ మీటర్ పెట్టించి ఆ చర్చ్ లో క్రిస్మస్ వెలుగులు నింపి వారి కళ్ళలో వెలుగు చూసి ఆనందపడ్డ డి.ఎస్.పి
అదే విధంగా పేద గిరిజన సంఘస్తులు కూడా క్రిస్మస్ పండుగ రోజు ఘనంగా జరుపుకోవాలని , నిత్యవసర సరుకులు మరియు చీరలు, పండ్లు పంపిణీ చేసి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన డి.ఎస్.పి,బోగిరి మోజస్ పాల్ వారి సతీమణి , బోగిరి కవితా పాల్, గిరిజన సంఘస్తులు సంఘ కాపరి వారి దాతృత్వానికి డి.ఎస్.పి దంపతులకు చిరు సత్కారం చేసి వారికీ కృతజ్ఞత చాటుకొన్నారు.
ఈ కార్యక్రమంలో మద్దూరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

DSP Bogiri Mojas Pal lights up Christmas

You cannot copy content of this page

Scroll to Top