Bathukamma Celebrations : కోలహాలం గా ముందస్తు బతుకమ్మ వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. బతుకమ్మ సెలవులకు ముందు రోజైన గురువారం నాడు పాఠశాల ఆవరణలో విద్యార్థినీ విద్యార్థులు అందంగా పేర్చిన బతుకమ్మలతో ఎంగిలిపువ్వు బతుకమ్మను ఆడుకున్నారు. ప్రధానోపాధ్యాయులు బి. శంకర్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరపు బతుకమ్మ వేడుకలను పాఠశాల విద్యార్థులు,తల్లిదండ్రులు, అధ్యాపక బృందం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనేక రకాల పూలతో అందమైన బతుకమ్మలను చిన్నారులు పేర్చారు. తంగేడు,గునుగు, టేకు,గులాబీ,గుమ్మడి తదితర పూలతో అందమైన బతుకమ్మలను రూపొందించారు.

ప్రధానోపాధ్యాయులు బి శంకర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల సాంప్రదాయానికి ప్రతిరూపమని, అలాంటి బతుకమ్మ పండుగ వేడుకలను ప్రతి సంవత్సరం మా పాఠశాలలోనే ప్రారంభించడం మా విద్యార్థిని విద్యార్థులకు,తల్లిదండ్రులకు, సిబ్బందికి ఎంతో ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శంకర్ తెలియజేశారు. పాఠశాలలో నిర్వహించే ఈ బతుకమ్మ వేడుకలకు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే కాక తల్లిదండ్రులు, పాఠశాల సమీప ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చే విషయం అని అన్నారు.ఈ కార్యక్రమములో విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామ పెద్దలు, యువత,గుడ్ సేఫర్డ్ కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు నిర్మల,సురేష్,ప్రశాంత్, ముతేశ్వరరావు,అరుణ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Early Bathukamma celebrations

You cannot copy content of this page

Scroll to Top