త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట నియోజకవర్గం లోని ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హౌసింగ్ పీడిపి గౌతమ్ ను కోరారు. ఆయన పీడీని కలిసి పెండింగ్ లో ఉన్న బిల్లులను వివరాలతో కూడిన నివేదికను సమర్పించారు. ఈనెల మూడవ తారీఖున బెండలపాడు గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి సహకరించిన అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో హౌసింగ్ అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


