
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి .
ప్రభుత్వం వడ్ల కొనుగోలు సక్రమంగా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు. PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి
Dont Exploit Farmers : దేవరకొండ డివిజన్/కొండ భీమనపల్లి మే 22, త్రినేత్రం న్యూస్. తరుగు’ పేరిట రైతులను నిలువు దోపిడీ చేయొద్దు అని PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి అన్నారు.శుక్రవారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పిలుపు మేరకు . నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి అని ఆయన అన్నారు రోజుల తరబడి కల్లాల్లో ఉన్న ధాన్యపు రాశులను పరిశీలించిన ఆయన, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ధాన్యం తరలించేందుకు సరిపడా లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయి అని ఆయన అన్నారు.రైతులు తీసుకొచ్చిన వడ్లలో అధికంగా తేమ, నాణ్యత పేరుతో అనవసర కోతలు విధిస్తున్నారు ఆయన తెలిపారు.
పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు.పంట వేసిన నాటి నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు.కాంటాలు సకాలంలో జరగక రైతులు ఎండలో, వర్షంలో రోజులు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయన అన్నారు.కొనుగోలు కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన అన్నారు.కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు ఆలస్యం అవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు.అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోతున్నా సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన అన్నారు.
అన్ని కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకంగా కాంటాలు నిర్వహించాలి అని ఆయన డిమాండ్ చేశారు.సరిపడా లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వెంటనే తరలించాలి..రైతుల వడ్లలో అన్యాయ కోతలు నిలిపివేయాలి అని ఆయన కోరారు.దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఇబ్బందులకు గురిచేయకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ,సర్పంచులు పల్లా శ్రీకాంత్ రెడ్డి, ఆడరాపు హరిక్రిష్ణ,తోటకూరి వెంకటయ్య, స్థానిక ఉప సర్పంచ్ కడారి సైదులు, ముదిగొండ సంజీవ, అప్పనాల తిరుమల్,గుండాల వెంకట్, ఇటుకల రాజు, బొడ్డుపల్లి ఏడుకొండల,కడారి అచ్చయ్య, జక్కుల అంజి, కడారి శ్రీను, జబ్బు ఉమ్మయ్య తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

