జూలై 7, 2026
TRINETHRAM NEWS
Shekhar Reddy BRS

ఉలుపాల శేఖర్ రెడ్డి .. బిఆర్ఎస్ పార్టీ నాయకులు .

Shekhar Reddy : చింత పల్లి మే 22, త్రినేత్రం న్యూస్. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు.వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులపై బిఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు చింతపల్లి మండలం తీదేడు వరి కొనుగోలు కేంద్రం వద్ద గ్రామ బిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్లాల్లో ధాన్యం కొనుగోలు చేయడం సరిగా లేకపోవడంతో రైతుల కళ్లల్లో కన్నీరు ఆగడం లేదని ఆయన అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి రైతులను మోసం చేసిందని తెలిపారు.రైతు బతికితేనే రాష్ట్రం బతుకుతుందని అన్నారు.రైతు వ్యతిరేక పాలనకు ప్రజలే సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.రైతుల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ధేన్యతండ గ్రామ సర్పంచ్ రమావత్ కొండల్ నాయక్,తీదేడు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోనగంటి గొవర్థనాచారి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రు రామారావు, ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,రమావత్ మాంత్య నాయక్,తిరుమణి పాపయ్య,కాయితి బచ్చిరెడ్డి, మర్రు శ్రీనివాసరావు,శివర్ల పర్వతాలు,శివర్ల రాములు,మర్రు సురెందర్ రావు,బొడ్డు చెన్నయ్య,మాదగోని కృష్ణ గౌడ్, రెడ్డి పరమేష్,వీరమల్ల వెంకటయ్య,గంటెల ఆంజనేయులు,కాయితి భగవాన్ రెడ్డి,మెరిక శంకరయ్య,ఉడుత శంకరయ్య,శివర్ల అనిల్, శివర్ల రమేష్,రమావత్ తుల్చ నాయక్,విజయ్,రాశిక మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page