జూలై 7, 2026
TRINETHRAM NEWS
Transportation at grain buying centers

Transportation : డిండి వ్యవసాయ మార్కెట్‌లో తడిసి ముద్దవుతున్న పంట, కన్నీరు పెడుతున్న రైతన్నలు
డిండి మండల భా రా స మాజీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు.

​డిండి( గుండ్లపల్లి )మే 22, త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్ర BRS పార్టీ పిలుపు మేరకు నల్గొండ BRS పార్టీ మాజీ అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ ఆదేశం మేరకు స్థానిక BRS పార్టీ శ్రేణులతో స్థానిక మార్కెట్ యార్డ్ ను బీ ఆర్ ఎస్ పార్టీ మాజి అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు సందర్శించటం జరిగింది ఈ సందర్బంగా డిండి లో గల స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు, రవాణా ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం, రవాణా కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని ఆయన అన్నారు.

మార్కెట్ యార్డులో ఓపెన్ ప్లాట్‌ఫారాలపై ఉన్న వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. సరైన తార్పాలిన్లు (కవర్లు) అందుబాటులో లేకపోవడం, ఎగుమతి వేగంగా జరగకపోవడంతో రైతులు కళ్లముందే తమ పంట నీటిపాలు కావడం చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. తడిసిన ధాన్యానికి రంగు మారి, మొలకలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..

​పదుల సంఖ్యలో లారీల ధాన్యం.. వస్తున్నవి రెండే లారీలు!

​ప్రస్తుతం డిండి మార్కెట్ యార్డులో దాదాపు 30 లారీలకు సరిపడా భారీ మొత్తంలో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రోజురోజుకూ రైతులు తెస్తున్న ధాన్యంతో మార్కెట్ కిక్కిరిసిపోతోంది. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం ఉన్నప్పటికీ, ఇక్కడి నుండి కేవలం రోజుకు 2 లేదా 3 లారీలలో మాత్రమే ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకు న్యాయం చేయాలి అని ఆయన అన్నారు..

ఈ కార్యక్రమం లో మాధవరం శ్రీనివాస రావు, సర్పంచ్ మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బలముల తిరుపతయ్య,తండు చంద్రయ్య గౌడ్, ఎండి రషీద్, గుర్రం సురేష్,సీమర్ల మల్లయ్య,మూడవత్ భాస్కర్,మల్లేపాకుల జయవర్ధన్, ఎండీ బాసీత్,గద్దర్ శ్రీను, తండు శ్రీనయ్య, పేట వెంకటయ్య,ఎం డి ఖలీల్ అంకల్,సభవాట్ రాములు,కాసుల శ్రీను,జరుపుల భాస్కర్, రామావత్ బాలు, రామావత్ ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page