జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 01 at 19.30.14

TRINETHRAM NEWS

Tribute to retired Rajamani

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఏరియా 1 జీఎం కార్యాలయం ఎస్ అండ్ పీసీ డిపార్ట్ మెంట్ లో పని చేసి సోమవారం పదవి విరమణ పొందుతున్న బొల్లం రాజమణి ఫిమేల్ సెక్యూరిటీ గార్డ్ ని రామగుండం ఏరియా -1 జీఎం కార్యలయం ఎస్ అండ్ పీసీ డిస్ట్రిబ్యూషన్ లో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి చేతుల మిధుగా పూలమాలలు, శాలువాలతో సన్మానించి వారికి జ్ఞాపికను అందజేసి వారు చేసిన పనులను కొనియాడారు.

ఈ సందర్భముగా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో, స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్నలను పొందారని, పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి శేష జీవితం సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం సెక్యూరిటీ డిపార్ట్ మెంట్, కుటుంబ సభ్యులు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ ఉమేష్, చంద శ్రీనివాస్, అక్బర్ అలీ సార్, జమాదర్స్, ఎస్ అండ్ పీసీ ఆఫీస్ సూపర్డెంట్ భాస్కర్, పిల్లి కుమారస్వామి, ఎఐటియుసి ఫిట్ సెక్రెటరీ శ్రీరెడ్డి వెంకటస్వామి, సెక్యూరిటీ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribute to retired Rajamani

You cannot copy content of this page