పెన్షనర్స్అసోసియేషన్ అనపర్తి యూనిట్ ఆధ్వర్యంలో, పెన్షనర్స్ భవనం లో పెన్షనర్స్ డే ఘనంగా నిర్వహించారు.కె.సాల్మన్ రాజు
త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తిలో, కె. సాల్మన్ రాజ్, అధ్యక్షతన జరిగిన సమావేశంలో తహశీల్దార్ డి వి ఎన్ అనీల్ కుమార్, ఎంపిడిఓ ఎమ్ రామకృష్ణారెడ్డి, ఎస్ టి వో వి.శ్రీనివాస్, సీనియర్ అకౌంటెంట్ పి.శ్రీనివాసులు,గౌరవ అధ్యక్షుడు పి వి ఎన్ సూర్యనారాయణ, లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.గత పదమూడు సంవత్సరాలుగా అసోసియేషన్ అభివృద్ధికి, భవన నిర్మాణానికి ఆయన సేవలకు గుర్తింపుగా సభ్యులు శాలువా, పూలమాల, మెమెంటో లతో అతిథులు ఘనంగా సత్కరించారు.సంఘం చేస్తున్న సేవలను అతిధులు కొనియాడారు.
తమ అనుభవాలును సమాజసేవకు,ప్రాంతం అభివృద్ధికి వినియోగించాలని తహశీల్దార్, ఎంపిడిఓ లు సూచించారు.పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేయగలమని ఎస్ టి వో శ్రీనివాసరావు, హామీ ఇచ్చారు.అనంతరం 75సంవత్సరాలు నిండిన ఎనిమిది మంది కి అసోసియేషన్ తరపున అతిధులు ఘనంగా సత్కరించారు.కార్యదర్శి గొలుగూరి రామా రెడ్డి, ట్రెజరర్ ఎమ్ వి సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు చాగంటి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఎమ్.వి.కృష్ణారెడ్డి, ఎస్ వి రామా రెడ్డి, అరవై మంది సభ్యులు హాజరయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


