
Dhyan Chand Jayanti : డిండి(గుండ్లపల్లి) ఆగష్టు 29, త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని స్పోర్ట్స్ క్లబ్ లో శనివారం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు బాదమోని శ్రీనివాస్ గౌడ్ , ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ హాకీ అద్భుతమైన ఆటలో” ది విజార్డ్ ” అని పిలవబడ్డారని, ఒలంపిక్స్ లో మూడు స్వర్ణాలు సాధించి తెచ్చి పెట్టాడని, భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందజేసిందని, ఖేల్ రత్న అవార్డు ధ్యాన్ చంద్ పేరు మీద ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మధుసూదనా చారి, శ్రీనివాసులు, గోల్డ్ రమేష్, తండ్డు చంద్రయ్య, ఏటీ కృష్ణా, సుంకరి చంద్రయ్య, అంజి యాదవ్, ఖయ్యాం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe