
–జాతీయ క్రీడా దినోత్సవం స్పోర్ట్స్ ర్యాలీ
Major Dhyan Chand Jayanti : దేవరకొండ డివిజన్ ఆగష్టు 29, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లో జిల్లా పరిషత్ (బాలుర) ఉన్నత పాఠశాల ZP(B)HS నుండి ప్రారంభమైన ర్యాలీని సీ ఐ వెంకట్ రెడ్డి , అధ్యక్షుడు ఎన్ వీ టీ సభ్యులతో కలిసి క్రీడాజ్యోతి వెలిగించి ర్యాలీని ప్రారంభించినారు. అనంతరం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనములో హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహానికి ఎస్ ఐ రాజు ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, ఎన్ వీ టి సభ్యులతో కలిసి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ అద్భుతమైన బాల్ కంట్రోల్ కారణంగా హాకీ క్రీడాలో “ది విజార్డ్” (The Wizard) అని పిలువబడ్డారు.ఆయన భారతదేశానికి 1928, 1932, 1936 ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిపెట్టారు.భారత ప్రభుత్వం 1956 లో ఆయనకు పద్మభూషణ్ అవార్డును అందజేసింది.మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అతని పేరు మీద ఉందని అన్నారు అలాగే విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదని ప్రతి రోజు క్రీడా మైదానంలో క్రీడలు ఆడాలని చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారని కాబట్టి ప్రతి విద్యార్థి క్రీడలు అలవర్చుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు దేవరకొండలో ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాలను ఏర్పాటు అందుబాటులోకి తీసుకురావాలని అన్న కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్ ,కోశాధికారి కృష్ణ కిషోర్, భాస్కర్ రెడ్డి, లీగల్ అడ్వైజర్, ఉమా మహేష్ , వై ఎస్ కరుణాకర్, తాళ్ల సురేష్, ఐ డీ ప్రసన్నకుమార్, జమీర్, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి భాస్కర్, రాజ్ కుమార్ రెడ్డి, జి రామకృష్ణ, సన్నీ, సాయి, అజయ్ చంద్ర, కానుగుల అంజి, యూనిస్, డాన్స్ మాస్టర్ వీ నిఖిల, సాయి తేజ, పీ ఈ టీ లు రజిత,విజయలక్ష్మి, రవి, కేతవత్ రవి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, ఎస్ పి ఆర్ స్కూల్, రవీంద్ర భారతి స్కూల్, బచ్పన్ స్కూల్, బ్రిలియంట్ స్కూల్, ZPBHS స్కూల్, మరియు NCC విద్యార్థులు, గర్ల్స్ హై స్కూల్, మెటిల్డా స్కూల్, క్రీడాకారులు కళాకారులు అన్ని స్కూళ్ల సిబ్బంది యజమాన్యం విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe