అక్టోబర్ 11, 2026
TRINETHRAM NEWS
Officials review

Officials Review : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 18, త్రినేత్రం న్యూస్. వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా సురక్షితంగా నిర్వహించేందుకు దేవరకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సబ్ కలెక్టర్ కరోలిన్ అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన మార్గంలో విద్యుత్ తీగలు అడ్డంగా రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, రోడ్ల మ్యాప్, వైద్య సిబ్బంది, మరియు మున్సిపల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశం లో డీఎస్పీ తహసిల్దార్ తోపాటు పోలీస్ , మత్స్య వైద్య విద్యుత్ ,మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page