
Cordial Meeting : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; కే.ఆర్. పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన ఆదివాసి గిరిజన సంఘాల నాయకులతో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, రహదారులు, త్రాగునీరు, ఉపాధి తదితర అంశాలపై గిరిజన సంఘాల నాయకులతో ఆయన చర్చించారు. వాళ్ల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో ఆదివాసి సంఘాల నాయకులు మొడియం శ్రీనివాస్, కాకి మధు,వివిధ ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe