రాజమండ్రి,మే 8: అన్నపూర్ణమ్మ పేట శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూం ను గురువారం పునః ప్రారంభించారు.1952వ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ స్వామి వివేకానంద మెమోరియల్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రీడింగ్ రూమ్ అన్నపూర్ణమ్మపేటలో ఆనాడు 13 మంది యువకులు 1975లో రీడింగ్ రూమ్ గా కొనసాగించి నాటి యువత ఆటలు, విజ్ఞానం వైపు వెళ్లే విధంగా ఈ సంస్థ పాటుపడింది. నేటికీ 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరలా అన్నపూర్ణమ్మపేట దుర్గాచౌక్ గుడి వద్ద ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ క్లబ్ నుండి అనేకమంది కబడ్డీ ఆటగాళ్ళు ఆటలో మెరికల్లా తయారై సర్టిఫికెట్లు పొంది నేడు అనేక ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉద్యోగస్తులుగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు.
మరల ఈ సంస్థ ద్వారా రాబోయే రోజుల్లో యువకులను కబడ్డీ క్రీడలోను,కాంపిటేటివ్ ఎగ్జాంలకు నిలయంగా ఈ సంస్థ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి మండల సూర్యనారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిఐఐసి మాజీ చైర్మన్ శ్రీఘాకొళపు శివరామ సుబ్రహ్మణ్యం, జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్, జామిశెట్టి గాంధీ మాజీ కార్పొరేటర్ బొట్ల సూర్య రావు, శివాజీ, ఏవిడి ప్రసాద్, ఎం.చంద్రశేఖర్, పి. శ్రీనివాస్ మల్లికార్జున్ ఎల్వి శ్రీనివాస్, బురిడి త్రిమూర్తులు, వి. శ్రీనివాస్, ఎం.శ్రీనివాస్, వీరబాబు, కుమార్, ఏడీ ప్రసాద్, బి.ఏలియా, ఈశ్వరరావు, వీర్రాజు, చిన వీరబాబు, పి. శ్రీనివాస్, క్రీడాకారిణి క్రీడాకారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


