సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Salaries must raised

Salaries must be Raised : కృష్ణాజిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 18 ; పామర్రు నియోజకవర్గం, మొవ్వ మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం ఉయ్యూరు డివిజన్ సంబంధించి గ్రామ రెవెన్యూ వీఆర్ఏల సామూహిక నిరాకరణ సమ్మెను 3 రోజులుగా నిర్వహించడం జరిగింది. వీఆర్ఏల జీతాలు పెంచాలని, కనీస వేతనం అమలు చేయాలని వాళ్ల పనికి తగ్గట్టు , ఎవరైతే విధులు సక్రమంగా శ్రద్ధతో నిర్వహించారో ప్రభుత్వం వాళ్లను గుర్తించి తక్షణమే ప్రమోషన్ లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామాలలో నిర్వహించే విధులు ప్రజలకు చాలా మంచి చేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

గత వైసిపి ప్రభుత్వం లాగా కాకుండా , కూటమి ప్రభుత్వం న్యాయం న్యాయం చేస్తోందని సంకల్పంతోనే ఈ సమ్మెను విజయవంతంగా మూడవరోజు కొనసాగించామని వెల్లడించారు. కనీస వేతనాలు పెంచితే మా కుటుంబాలు సక్రమంగా బాగుపడతాయని, మేము చేసే పనులకు వీఆర్ఏ ల వీఆర్వోలుగా ప్రమోషన్ చేస్తే సంతోషదాయకంగా ఉంటుందని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ఏలు, పదవి విరమణ చేసినటువంటి వీఆర్వోలు మద్దతుతో ఇందులో భాగంగా రాజేష్, శ్యామల, రామస్వామి, నాగరాజు, సంబంధించిన వాళ్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page