Mon. Mar 9th, 2026

JEE : జేఈఈ మెయిన్‌ దరఖాస్తుకు ఈ నెల 25 వరకు గడువు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 02, 2026, జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షకు ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆదివారం తెలిపింది.

ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తుది విడత పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు పేర్కొంది.

కాగా తొలి విడత పరీక్షలు జనవరి 29తో ముగియగా వాటి ఫలితాలు ఈ నెల 12వ తేదీలోపు వెల్లడికానున్నాయి. తుది విడత పరీక్షలు పూర్తయిన తర్వాత రెండు పరీక్షల్లో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకును కేటాయించనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deadline for JEE Main applications

Related Post

You cannot copy content of this page