-దేవరకొండ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం .
- మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 07, త్రినేత్రం న్యూస్.. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని 18,19 వార్డులలో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ముఖ్యమంత్రి రేవంత్ ను, ఆయన ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఆయన అన్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది అని ఆయన తెలిపారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. దేవరకొండ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేతావత్ బిల్యా నాయక్,నేనావత్ కిషన్ నాయక్, వడత్య రమేష్,గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్, కౌన్సిలర్ అభ్యర్థులు విరమోని అంజి గౌడ్, ఖాదర్ బాబా,మురారి,చంద్రమౌళి,లక్ష్మణ్, ఇద్దరమూలు,పాషా,లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


