Free Medical Camp : సాయి లత మోడల్ స్కూల్ లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
కూకట్పల్లి ఫిబ్రవరి 7 (త్రినేత్రం న్యూస్) : షాపూర్ నగర్ లోని సంజయ్ గాంధీ నగర్ లోని సాయి లత మోడల్ స్కూల్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిభిరానికి విశేష స్పందన లభించింది. సూరారం లోని మల్లారెడ్డి ఆసుపత్రి వైద్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత శిబిరాన్ని నిర్వహించారు.
జనరల్, గుండె, కంటి, దంత, స్త్రీ వైద్య నిపుణులతో పాటు అన్ని రకాల వైద్య పరీక్షలను చేశారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేపడతామని వైద్య నిపుణులు తెలిపారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన రావడం సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ నార్త్ అధ్యక్షులు బిర్రు ఆంజనేయులు తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాలలో పాము ఎప్పుడు ముందుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సాయి లతా మోడల్ పాఠశాల కరస్పాండెంట్ అర్చన, ప్రిన్సిపాల్, లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నార్త్ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ దయాకర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సిహెచ్ నరసింహులు గౌడ్, భాష, సంజయ్ గాంధీనగర్ బస్తీ నాయకులు లక్ష్మీనారాయణ, రాజలింగం, భద్రప్ప, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

