జూన్ 26, 2026
TRINETHRAM NEWS
coalition government is amazing

Coalition Government : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 04; పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండల, తాట్కురు గొ మ్ము పంచాయితీలోని పదమూడు వ వార్డుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుంజా రామారావు, మాజీ సర్పంచ్ ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.

ఆ వార్డులో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. వీధి దీపాలు, నీటి సౌకర్యం, మొదలైనవి బాగానే ఉన్నాయని వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, కొత్త పెన్షన్ లు సమస్య ఉందని ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని అమలు పరచాలని కోరారు . పోలవరం ముంపు ప్రాంతం వల్ల ప్రభుత్వం నుండి ఎటువంటి లోన్లు అనేవి రావడంలేదని పేర్కొన్నారు. ఎప్పుడు జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి తిరుగు లేదని ప్రజలు అంటున్నారని సూచించారు. అయితే ఆ గ్రామాలలో డ్రైనేజీ, సిసి రోడ్లు సమస్య ఉందని తెలిపారు.
ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆ సమస్యకు పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన ఎంత శాతం పూర్తి అయ్యిందో వెల్లడించారు. మే నెల ఇరవై ఏడు,ఇరువై ఎనిమిది మండలంలో జరిగిన మహానాడు గురించి చెప్పారు. . ఒక పండుగలా జరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా టిఫిన్స్, మంచినీరు, భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించారని , చెప్పడం జరిగింది. కూటమి సమన్వయంగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు..

అధిష్టానం కార్యకర్త నాయకుడని అంటుంది గాని, ఆ కార్యకర్తను గుర్తించడం లేదని బాధ ను తెలియపరిచారు. శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి మా గ్రామాలకు వచ్చాడే కానీ, గెలిచిన తర్వాత ఇంతవరకు మా ఊరు చూడలేదని ఆయనపై మండిపడ్డారు. అటువంటి శాసనసభ్యులకు ఓట్లు వేసి గెలిపించినందుకు సిగ్గుచే టుగా ఉందని అన్నారు. అటువంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page