TDP : చైర్మన్ పీఠంపై టిడిపి కన్ను

TRINETHRAM NEWS

తేదీ : 15/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమని విజయవాడ పరిధిలో ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుందని అధికార పార్టీ తెలిపింది. ఫీల్డ్ కవర్ తీర్పు నేపథ్యంలో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వేదికగా చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఒకవేళ ఎన్నిక అనివార్యం అయితే మెజార్టీ సభ్యులతో టిడిపి ఖాతాలోకి మున్సిపాలిటీ వెళ్తుంది. కోర్టు ఆదేశాల మేరకు షీల్డ్ కవర్ ఫలితాన్ని అధికారులు వెల్లడిస్తారు. కొండపల్లి, ఇబ్రహీం పరిధిలో అదనపు పోలీస్ బలగాలు మోహరించడం జరుగుతుంది.
నలుగురు కంటే ఎక్కువమంది గుమ్మి గూడితే కటకటాల వెనక్కి పెట్టే విధంగా సెక్షన్ విధించడం జరిగింది. కొండపల్లి మున్సిపల్ ఎన్నిక జరిగితే టిడిపిలోకి వచ్చిన కౌన్సిలర్లతో సంబంధం లేకుండానే పదిహేను మంది సభ్యులు తో టిడిపి పాలకవర్గం ఏర్పాటుకు అవకాశం ఉంది. వైసిపి బలం పద్నాలుగు గా అన్నప్పటికీ ఇందులో ఒక కౌన్సిలర్ ఇటీవల మరణించడంతో ఓటు వేసే వారి సంఖ్య పదమూడు గా ఉంది. అందులో కొందరు ఇప్పటికే టిడిపికి జై కొట్టారు. దీంతో ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎమ్మెల్యే వసంత మాట వేద వాకు గా నడుచుకునే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP eye on the

You cannot copy content of this page

Scroll to Top