
Korra Kishan Naik : దేవరకొండ డివిజన్ జూన్ 04, త్రినేత్రం న్యూస్. దేవరకొండ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి పద్మప్రియ ని గురువారం ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో భాగంగా దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు, పరిపాలనాంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంచేందుకు, నిరుపేదలకు, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా డాక్టర్ కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ…”నూతన ఆర్డీఓ పద్మప్రియ నాయకత్వంలో దేవరకొండ డివిజన్ లోని రెవెన్యూ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని, ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కాగలవని ఆశిస్తున్నాం. సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడంలో నూతన అధికారిణి చొరవ చూపాలని ఆర్టీఐఏఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా,, కొర్ర. కిషన్ నాయక్ కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
