Former MLA Satthi : కూటమి ఏడాది పాలన మోసాలమయం

TRINETHRAM NEWS

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చేసాను అని చెప్పటం సిగ్గుచేటు

హామీలు ఇవ్వటం ఎగ్గొట్టడం చంద్రబాబు నైజం

రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో విధ్వంసం

అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, కూటమి ఏడాది పాలన మోసాల మయం. నయవంచన పాలనగా మారిందని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు.ఈరోజు “బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ” పై రంగంపేట మండల వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈలకొలనులో జరిగింది. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్నారని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పేర్కొన్నారు. జగన్ ఇస్తున్నవే కాకుండా అంతకు మించి ఇస్తానని, ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారన్నారు. బాండ్లు ఇచ్చి, ప్రలోభాలు పెట్టి ప్రజలను పచ్చిమోసం చేశారన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, 20 లక్షల ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు పాలనతో ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత అనేది ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. రీ కాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.
మోసం చేసి సంబరాలా!
ఎన్నికల సమయంలో హామీలతో ప్రజలను నమ్మించి గెలుపొందిన కూటమి నేతలు అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరించారు. హామీలు అమలు చేయకుండా సుపరిపాలన అంటూ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్దాం. ప్రజలు మోసపోయిన విధానాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా వివరిద్దాం అని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పిలుపునిచ్చారు.

ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత.. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రభుత్వ మోసాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలు. అన్యాయాలు, దౌర్జన్యాలను ప్రజలకు వివరిద్దామన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన సంక్షేమం అభివృద్ధి విషయాలను ప్రజలకు చెప్పాలన్నారు.

ఈ కార్యక్రమంలో రంగంపేట మండల పార్టీ నాయకులు, నేతలు, యువజన విభాగం ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు,మహిళా విభాగం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition's one-year rule

You cannot copy content of this page

Scroll to Top