Coalition Government : కూటమి పాలన అద్భుతం

TRINETHRAM NEWS
coalition government is amazing

Coalition Government : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 02 ; పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, కన్నాయిగుట్ట గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీ శ్రీనివాసరావు , ఎ ఎస్ పి రాష్ట్ర అడ్వైజర్ పైథా రమేష్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కులం, మతం, భాష , పార్టీ బేధం లేకుండా సూపర్ సిక్స్ పథకాలు అందాయని అన్నారు.

ఆ పంచాయతీలో ఎంతమందికి పింఛన్లు ఇస్తున్నారో తెలిపారు. వీధి దీపాలు బాగానే ఉన్నాయని వివరణ అందించారు. నిరుపేదలకు ఇళ్ళు, కొత్త పెన్షన్ లు సమస్య ఉందని ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని అమలు పరచాలని కోరారు . ఎప్పుడు జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి తిరుగు లేదని ప్రజలు అంటున్నారని సూచించారు. అయితే ఆ గ్రామంలో డ్రైనేజీ, నీటి సమస్య ఉందని తెలిపారు.
ప్రభుత్వం గుర్తించి తక్షణమే ఆ సమస్యకు పరిష్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు .కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ నుండి ఆ గ్రామాలకు ఎన్ని నిధులు వచ్చాయో వివరణ అందించారు. వాటిని అభివృద్ధి కోసం ఉపయోగించారని పేర్కొన్నారు. ఆదివాసి గిరిజన సంక్షేమ సంఘం తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

పి – నాలుగు, ఇంటి పన్ను, జన గణన ఎంత శాతం పూర్తి అయ్యిందో వెల్లడించారు. ముఖ్యమంత్రి సహాయక నిధి చెక్కులను ఎంతమందికి ఇచ్చారో చెప్పారు. మే నెల ఇరవై ఏడు,ఇరువై ఎనిమిది మండలంలో జరిగిన మహానాడు గురించి చెప్పారు. . ఒక పండుగలాజరిగిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా టిఫిన్స్, మంచినీరు, భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలు కల్పించారని , చెప్పడం జరిగింది.

శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి మా గ్రామానికి వచ్చాడే కానీ, గెలిచిన తర్వాత ఇంతవరకు మా మొహం చూడలేదని ఆయనపై మండిపడ్డారు. అటువంటి శాసనసభ్యులకు ఓట్లు వేసి గెలిపించినందుకు సిగ్గుచే టుగా ఉందని అన్నారు. అటువంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు వేస్తారా? అని ప్రశ్నించారు. అదేవిధంగా పోలవరం ముంపు ప్రాంతం గురించి స్పష్టంగా వివరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top