జీవో 51 రద్దు చేయాలని డిమాండ్ – పొద్దు బాలదేవ్
అల్లూరిజిల్లా (అనంతగిరి) త్రినేత్రం న్యూస్ జూలై 2 : మండలంలోని పెద్దకోట హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 51 (ఎనర్జీ) తేదీ 30-06-2025ను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు.
పెసా చట్టం, అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టాలను లెక్కచేయకుండా ఏకపక్షంగా జీవో జారీ చేయడం అవివేకమని అన్నారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1800 మెగావాట్లకు పెంచడమే కాక, స్థానిక వాగు నుంచి 16.547 ఎంసీఎం నీటిని తరలించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా విమర్శించారు.
ప్రాజెక్టు పాదభూమి ఆదివాసీ పంచాయితీల పరిధిలో ఉండగా, గ్రామ సభల అనుమతి లేకుండా జీవో జారీ చేయడం చట్ట విరుద్ధమని తెలిపారు. నీటి అవసరాల కోసం వాగులపై ఆధారపడే ఆదివాసుల హక్కులను ఖండించి, కార్పొరేట్ సంస్థకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఖండించారు.
ముందు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఒప్పందాన్ని తాజాగా చంద్రబాబు ప్రభుత్వం పునరుద్ధరించడాన్ని ఖండిస్తూ, తక్షణమే జీవోను రద్దు చేసి ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆదివాసీ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


