CJI Justice Suryakant : రాష్ట్రానికి రానున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

TRINETHRAM NEWS

అమరావతిలో జ్యుడిషియల్ అకాడమీ, హైకోర్టు అతిథి గృహ భవనాలకు శంకుస్థాపన.

Trinethram News : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, ఆదివారం ఉదయం తిరుపతి లోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి పునాదిరాయి వేస్తారు.

అనంతరం తిరుపతి నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటలు సమయంలో రాజధాని అమరావతి చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, హైకోర్టు అతిథి గృహ భవనానికి శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజయవాడలో ‘మధ్యవర్తిత్వం’పై నిర్వహించే సదస్సులో ప్రసంగిస్తారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

CJI Justice Suryakant to visit state

You cannot copy content of this page

Scroll to Top