భారత రాజ్యాంగంపై ప్రసంగం
Trinethram News : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆదివారం విజయవాడకు రానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగిస్తారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొంటారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


