
Chief Minister Visit : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 08 ; కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలం గ్రామంలో ఈ నెల అనగా ఆగస్టు 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పార్థసారధి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండు హెలిప్యాడ్ , అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం ప్రక్కన ఖాళీస్థలంలో ప్రజావేదిక, అగ్రికల్చర్ మార్కెటు కమిటీ కార్యాలయం క్యాడరు మీటింగు సభాస్థలి, తదితర ప్రాంతాలను మంత్రితో పాటు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడలు పరిశీలించారు.
డైనమిక్ శాసనసభ్యులు, గృహ నిర్మాణం మరియు పౌర సంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, ఈ నెల 10వ తేదీన కలిదిండి మండలంలో “మీ భూమి-మీహక్కు’రాజముద్రతో రూపొందించిన పట్టదారు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏ గ్రామం పర్యటించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పట్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు అని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చి ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. రెవెన్యూ శాఖలో చేసిన విధ్వంసం కారణంగా దానిని పునరుద్ధరించడానికి ఇన్ని నెలలు పట్టిందని, ప్రజలు ఆస్తులకు భరోసా, ప్రజలు జీవితాలకు విశ్వాసం కల్పించాలన్న కారణంగా రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని సూచించారు. గత ప్రభుత్వం లో మీఆస్తిపై వాళ్ల బొమ్మలు వేసుకున్నారని, ఆస్తిమీది, ఫోటో ఆయనది అన్నారు. సరిహద్దు రాళ్లపై కూడా ఆయన బొమ్మ చెక్కించుకున్నారని, 77 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. 2019-24 మధ్య జరిగిన వ్యవహారాలు కారణంగా పెద్ద ఎత్తున భూవివాదాలు వచ్చాయని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు నుంచి వచ్చిన అర్జీల్లో ఎక్కువ శాతం భూ సమస్యలేనని అన్నారు. అందుకే శాశ్వతంగా భూసమస్యల్ని పరిష్కారం చేసి భూమిని హక్కుగా మీకు కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టామని సంతోషం వ్యక్తం చేశారు.
గతపాలకులు ల్యాండు టైటిలింగు యాక్టు ద్వారా బెదిరించి మీ ఆస్తుల్ని కాజేయాలని చూశారని, మేము అధికారంలోకి వస్తూనే ఆ చట్టాన్ని రద్దుచేసి మీకు న్యాయం చేశామని చెప్పారు. సచివాలయం లోనే భూమి రికార్డులకు సంబంధించిన వివరాలను సరిచేసుకునే అవకాశాన్ని కూడా స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో చేసుకోవచ్చునని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో అతి తక్కువ సమయంలో గాడిలో పెడుతున్నారని వెల్లడించారు. అమరావతి, పోలవరం, రాష్ట్రంలో వివిధ నీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, పరిశ్రమలు స్థాపనలు నిరంతరం ముఖ్యమంత్రి ఎంతో శ్రమిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు వాళ్ల బొమ్మలు వేసుకుని రూ 400 కోట్లు వృధా చేశారని గుర్తు చేశారు. కైకలూరు నియోజకవర్గంలో 22(ఏ) క్రింద 3,850 ఎకరాలకు మోక్షం కలిగిందని, ఎంతో మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారని సూచించారు. ఇందులో స్వాతంత్ర సమర యోధులు, ప్రజలు, రైతులు తమకు జరిగిన లబ్దిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజెప్పడానికి, కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe