సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Arrests for Questioning

Arrests for Questioning : అల్లూరిజిల్లా అరకులోయ సెప్టెంబర్ 01, (త్రినేత్రం న్యూస్): విశాఖపట్నం మారికవలస గురుకులం పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఆదివాసీ ఉద్యమ నాయకులను అక్రమంగా గృహనిర్బంధాలు, అరెస్టులు చేయడం అన్యాయమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ తీవ్రంగా ఖండించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్, గౌతమ్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మారికవలస గురుకులం పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ గిరిజన విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ ప్రజా సంఘాలు చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 28 తేదీన అర్థరాత్రి మారికవలస గురుకులం పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి పాడేరు నుండి విద్యార్థులకు బస్సులు పెట్టీ తిరిగి విశాఖపట్నం పాఠశాల తరలించారని గిరిజన విద్యార్థులకు ఉండడానికి సరయిన వసతి,భోజనాలు పెట్టకుండా చిన్న రెండు గదులు కేటాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రాష్ట్ర ప్రభుత్వం మారికవలస పాఠశాల స్కూల్ అక్సులెన్సుని కొనసాగిస్తామని హామీ ఇచ్చి గిరిజన విద్యార్థులకు తీవ్ర ఇబ్బందుల గురి చేయడం అన్యాయమని ప్రశ్నించిన ఆదివాసీ ఉద్యమ నాయకులను ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ నాయకులు పి అప్పలనర్స ను విశాఖపట్నం మధురవాడ పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంటాడి అరెస్ట్ చేశారని ఆదివాసీ గిరిజన సంఘం,జిల్లా అధ్యక్షులు ధర్మానపడాల్ ను పెదబయలు లో గృహ నిర్బంధం చేశారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు వి హరేంద్రదాస్ నిరుద్యోగుల సంఘం జిల్లా నాయకులు భాను సిహెచ్ రావు వై కుమారులను అక్రమంగా పోలీసులు ఇళ్లల్లో చొరబడి అరెస్టు చేసి పాడేరు పోలీస్ స్టేషన్ తరలించాలని అక్రమంగా గృహ నిర్బంధాలు విధించడం, వెంటపడి వేదించి అరెస్టు చేయడం అన్యాయమని ఆదివాసీ ఉద్యమకారులపై అక్రమ నిర్బంధాన్ని అందరు ఖండించాలని మారికవలస గురుకులం పాఠశాల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page