
త్రినేత్రం న్యూస్ : Dr. Priyanka : రాజమహేంద్రవరంలో కారుతో ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) కన్నుమూశారు. ప్రసాదిత్య మాల్ సమీపంలో జరిగిన వివాదం అనంతరం మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఆమెను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ప్రియాంక.. రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమె కుటుంబంలో తొలి డాక్టర్‌గా వైద్య రంగంలో సేవలందించాలనే కలతో ముందుకు సాగుతున్నారు.
కుమార్తెను కోల్పోయిన విషాదంలోనూ ఆమె తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించడం గొప్ప మానవత్వానికి నిదర్శనం.
డాక్టర్ ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe