అక్టోబర్ 10, 2026
TRINETHRAM NEWS
Accused sentenced

–నల్లగొండజిల్లా POCSO న్యాయస్థానం*

Accused Sentenced : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 31, త్రినేత్రం న్యూస్. డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో 08 – 09- 2020 రోజు మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో 12.09.2020 రోజున బాధిత మైనర్ బాలిక యొక్క తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది.31 ఆగస్టు 2026 రోజున నల్లగొండ జిల్లా ఫోక్సొ న్యాయస్థానం తీర్పును వెలువరించడం జరిగింది.

తీర్పుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..08 సెప్టెంబర్ 2020 రోజున… డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత మైనర్ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 376(2),(n),506 IPC and section 5 (l) r/w 6 of POCSO ACT 2012. కింద ప్రతాప్ నగర్ విలేజ్,డిండి మండలం,నల్లగొండ జిల్లా నిందితుడు ఆటో డ్రైవర్ మూడవత్ మల్లేష్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి సెషన్స్ కేసు నెంబర్ 101/2021, ఎఫ్ ఐ ఆర్ నెంబర్ 97/2020. నిందితుడు సదర్ మైనర్ బాలికను లోబర్చుకొని బలవంతంగా లైంగికంగా అత్యాచారం చేయడం జరిగింది. ఇట్టి విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడం జరిగింది.

ఈ విషయం మీ తల్లిదండ్రులకు చెప్తే మీ పరువు తీస్తానని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. పరువు ఎక్కడ పోతుందోననే భయంతో గత్యంతరం లేని పరిస్థితులలో 08 సెప్టెంబర్ 2020 రోజున పురుగుల మందు సేవించడం జరిగింది.సదరు మైనర్ బాలికను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుండి మెరుగైన వైద్యం కోసం సెవెన్ హిల్స్ హస్తినాపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది.అక్కడ డాక్టర్ల పరిశీలనలో సదరు మైనర్ బాలిక మూడు నెలల గర్భవతిని తేలింది.

సదరు మైనర్ బాలికను మూడవత్ మల్లేష్ పలుమార్లు (రేప్) అత్యాచారం చేయడం జరిగింది.విచారణ అనంతరం ఇట్టి కేసులో ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలతో ఏకీభవించిన గౌరవ న్యాయస్థానం ఈరోజు నిందితునికి సెక్షన్ 376(2) IPC కింద 10 సంవత్సరాల కారాగార శిక్ష,5000 రూపాయల జరిమాన POCSO న్యాయస్థానం న్యాయమూర్తి విశ్వనాధ్ కులకర్ణి దిలీప్ రావు విధించడం జరిగింది. బాధిత మైనర్ బాలికకు 7 లక్షల రూపాయల కంపెన్సేషన్ న్యాయస్థానం ప్రకటించింది.

అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం.రాములు,ఆనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఎస్ హెచ్ ఓ, సిహెచ్.బాలకృష్ణ, ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ కే.బీసన్న,CDO పి.లింగయ్య,, భరోసా లిగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కేసు విచారణ లో తోడ్పాటు అందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page