
–సీడీపీఓ దొడ్డి వెంకటమ్మ పదవి విరమణ. యేకుల రాజారావు
CDPO are Commendable : దేవరకొండ డివిజన్ ఆగస్టు 31, త్రినేత్రం న్యూస్. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం లోని వట్టo రవి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం సీడీపీఓగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన దొడ్డి వెంకటమ్మ ఆత్మీయ అభినందన, సన్మాన కార్యక్రమం లో టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు ముఖ్య అతిథిగా పాల్గొని సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో బాధ్యతాయుతంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం, సంక్షేమ శాఖలో విధి నిర్వహణలో 43 సంవత్సరాలు అంకితభావంతో పనిచేసి ఎందరో మన్నలను పొంది విధులు నిర్వర్తించి ఐసిడిఎస్ మక్తల్ ప్రాజెక్ట్ అధికారి సి డి పి ఓ గా పదవీ విరమణ పొందడం అభినందనీయమని అన్నారు. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారుల సంక్షేమానికి సీడీపీఓగా ఆమె అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం దొడ్డి వెంకటమ్మ ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని, అంగన్వాడి టీచర్ నుండి అంచలంచలుగా పదోన్నతి పొంది సిడిపిఓ గా సోమవారం పదవీ విరమణ పొందుతున్న దొడ్డి వెంకటమ్మకీ అభినందన తెలియజేశారు ఉద్యోగరీత్యా పదవి విరమణ కానీ జీవితానికి కాదని శేష జీవితంలో సమాజ శ్రేయస్ కోసం తోడ్పట్నందించాలన్నారు.
కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe