Trinethram News : అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం… గత పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది.
2003లో టీటీడీలో ప్రాణదానం కార్యక్రమం చేపట్టాం. శ్రీవారి కృపతోనే 23 క్లైమోర్ మైన్స్ దాడి నుంచి బయపడ్డాను… శ్రీ వేంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన పునర్జన్మ అది. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అన్న వ్యక్తులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు
గత పాలనలో అంతర్వేది రథం తగలబెడితే, రామతీర్ధంలో విగ్రహం ధ్వంసం చేస్తే చర్యలు తీసుకోకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేశారు… 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతోందని చెప్పినా పట్టించుకోకుండా యదేఛ్చగా కొనసాగించారు… అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రక్షాళన చేయటంలో భాగంగా లడ్డూ శాంపిళ్లు తీసి ఎన్డీడీబీకి పంపాం
సిట్ నివేదిక చూస్తే అన్ని రసాయనాలు, పామాయిల్‌తో నెయ్యి తయారు చేసినట్టు వెలుగు చూసింది… భగవంతుడు అంటే లెక్కలేని తనంగా వ్యవహరించారు. హైందవం పట్ల ఆయనకు విశ్వాసం లేకపోతే ఇలా చేస్తారా?
దుర్మార్గం, మహా పాపం చేశారు. చరిత్రలో శ్రీవేంకటేశ్వర స్వామితో ఎవరూ ఆటలాడుకోలేదు… బ్రిటీషర్లు కూడా సంప్రదాయాలు, ఆచారాలను మెరుగుపరిచారు. వాళ్లకంటే హీనంగా గత పాలకులు వ్యవహరించారు… బూతులు తిట్టినా భరించాను. వారు ఏం చేసినా నిస్సహాయంగా మిగిలిపోవాలా?
సీబీఐ నివేదికలో ఎక్కడా కల్తీలేదని నిర్ధారించలేదు. కరడు గట్టిన నేరస్తులు అసత్యాన్ని ఎలా నమ్మించాలో ప్రయత్నిస్తారు? తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఈ తరహా విషయాలను ముక్తకంఠంతో ఖండించాలి… తిరిగి ఈ తరహా మహాపచారం చేయాలంటే భయపడాలి. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వదిలిపెట్టబోము. లక్షల మంది ప్రజలకు అదే కల్తీ నెయ్యిని వాడిన లడ్డూను ప్రసాదంగా ఇచ్చి గత పాలకులు మహా పాపం చేశారు.
తిరుమలలో తయారు చేసిన లడ్డూ ప్రసాదం అక్కడే తయారవుతుంది. కానీ దానిని ఎవరూ రెప్లికేట్ చేయలేరు… గత ఐదేళ్లలో లడ్డూ ప్రసాదం తినాలంటేనే భక్తులు భయపడిన పరిస్థితి. మానసికంగా ఇబ్బందులు పడ్డారు… లడ్డూ కల్తీ చేసిందే కాకుండా ఇప్పుడు మళ్లీ ఎదురుదాడి చేసి, జరిగిన ఘటనను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు… దోషులను కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ఏ ల్యాబ్ లో అయినా ఒకే తరహా నివేదిక వచ్చింది.
2022లో వచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపట్టారు.? అప్పుడే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఉద్దేశపూర్వకంగా అక్రమాలు చేయడానికే గత పాలకులు ఈ ప్రయత్నం చేశారు.. గతంలో పనిచేసిన చైర్మన్ పీఏకు రూ.4 కోట్ల డబ్బులు లంచంగా ఇచ్చారు… టీటీడీ బోర్డు చైర్మన్ కు, పర్చేజ్ కమిటీకి తెలిసే ఈ నిర్ణయాలు జరిగాయి. ఇప్పుడు వాళ్లే ఎదురు దాడి చేస్తున్నారు… దౌర్జన్యం, రౌడీయిజం చేయాలనుకుంటే మీ ఆటలు సాగవు అని హెచ్చరిస్తున్నాం… నాడు వివేకానందరెడ్డిని హత్య చేసి మళ్లీ నాపై ఆరోపణలు చేశారు.
ఇప్పుడు శ్రీవారి ప్రసాదం కల్తీ చేసి మళ్లీ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు… భక్తుల విశ్వాసంపైనా, నమ్మకంపైన దాడి చేస్తున్నారు. ఆయనకు వేంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే డిక్లరేషన్ పై ఎందుకు సంతకం పెట్టలేదు.? అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ పై సంతకం చేశారు. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే. సంతకమే చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించిన వ్యక్తులు మాపై నిందారోపణలు వేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


