Water Association : అమరావతి బయలుదేరిన నీటి సంఘాల అధ్యక్షులు

TRINETHRAM NEWS

జెండా ఊపి బస్సులు ప్రారంభించిన మండలి వెంకట్రామ్

Trinethram News : అవనిగడ్డ: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నియమించిన నీటి సంఘాలు రైతులకు సత్ఫలితాలు ఇస్తున్నాయని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం అమరావతిలో జరిగే సాగునీటి సంఘాల సదస్సుకు కోడూరు, నాగాయలంక డీసీల పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు రెండు బస్సుల్లో అమరావతికి బయలుదేరారు.

ఈ సందర్భంగా వెంకట్రామ్ పచ్చ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. జల వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ బస్సుల్లో పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, నాగాయలంక డీసీ చైర్మన్ బండ్రెడ్డి నాగ మల్లికార్జునరావు (చినబాబు), కోడూరు డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, డీఈఈ బీబీఎస్ గణపతి, ఏఈఈలు పొన్నూరు రవితేజ, దోవారి విజయ్ కుమార్, నీటి సంఘాల అధ్యక్షులు రాజధానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు బండే రాఘవ, మండలి రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Water Association Presidents leave for Amaravati

You cannot copy content of this page

Scroll to Top