
Birthday Celebrations Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం శివాలయం లో జనసేన పార్టీ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అర్చన మరియు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని, చందు నాయక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామి వారిని వేడుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, చందు నాయక్ నాయకత్వం పట్ల తమకున్న అచంచలమైన నమ్మకాన్ని తెలియజేశారు. మరియు వృద్ధాశ్రమంలో, బ్రెడ్లు పండ్ల పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చందు నాయక్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఒంటెద్దు మహేష్, ఏబీవీ జిల్లా నాయకులు యలమల్ల గోపీచంద్, కాటేపాక నవీన్, నల్లవెల్లి శ్రీనివాస్, మూడప్పు నాగరాజు, జిల్లా పవన్ కుమార్ అల్లంపల్లి శ్రావణ్ కేతావత్ నాగరాజు, జనసేన పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe