
MLA Songa Roshan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 18 ; చింతలపూడి నియోజకవర్గంలో రూపాయలు యాబై ఆరు కోట్లతో త్రాగు నీటి సరఫరా పథకానికి డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ భూమి పూజ చేశారు. ఐదు రక్షిత నీటి పథకాలు( ట్యాంక్) ఏర్పాటు చేయడం ద్వారా పట్టణంలో అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా చేయనున్నట్లు సూచించారు.
పట్టణంలో తాగునీరు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రతి ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముందు చూపుతోరాబోయే పది హేను సంవత్సరాల వరకు సరిపోయే విధంగా నీటి పథకాలు ఏర్పాటుకు ప్రణాళికలు రచించారన్నారు.
నియోజవర్గ అభివృద్ధికి తాను అంకితం ప్రజల సహకారం కృషి చేస్తున్నట్టు రోషన్ కుమార్ పేర్కొన్నారు. చింతలపూడిలో త్వరలో వంద పడకల వైద్యశాల భవన ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిప్రతిపాదనలు పంపనున్నారు.
నియోజకవర్గ ప్రజల అవసరాలను గుర్తించి రహదారులు అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమృత్ డైరెక్టర్ పాండురంగారావు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe